జగన్ తిరుమల పర్యటన : అక్టోబర్ 11 న శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించబోతున్నారు. అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 న జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ సమర్పించనున్నారు.

అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోమందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ పోటును ప్రారంభించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలు విషయానికి వస్తే..7వ తేది ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇక 7వ తేది రాత్రి పెద్దశేష వాహనం.. 8వ తేది ఉదయం చిన్న శేషవాహనం….రాత్రి హంస వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 9వ తేది ఉదయం సింహ వాహనం….రాత్రి ముత్యపు పందిరి వాహనం జరుగనుండగా.. 10వ తేది ఉదయం కల్పవృక్ష వాహనం….రాత్రి సర్వభూపాల వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి.

11వ తేది ఉదయం మోహిని అవతారం….రాత్రి గరుడ వాహనం జరుగనుండగా.. 12వ తేది ఉదయం హనుమంత వాహనం….సాయంత్రం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం.. రాత్రి గజ వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 13వ తేది ఉదయం సూర్యప్రభ వాహనం….రాత్రి చంద్రప్రభ వాహనం జరుగనుండగా.. 14 వ తేది ఉదయం రథం బదులుగా సర్వభూపాల వాహనం ….రాత్రి అశ్వవాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 15వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.