రామతీర్థం ఘటనలో అనుమానితుల అరెస్ట్
ఎస్పీ రాజకుమారి వెల్లడి

రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని జిల్లా ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో గత నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే.
ఈ ఘటనకు సంబంధించి పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/