మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్న భార్య , భర్త ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు సమాజంలో ఉన్నంత స్థాయి వారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఉన్నంత స్థాయి SI పోస్ట్ లో ఉండి, కట్టుకున్న భార్య ను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ భార్య..భర్త ను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పగించింది.

వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ వనస్థలిపురం హైదరాబాద్ కమిషనరేట్ లో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్స్ పెక్టర్ గా రాజు పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఈయన మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మరో మహిళతో ఉన్న సమయంలో ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని , వనస్థలిపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన భర్తపై కఠన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె ఆందోళనకు దిగారు. తన భర్తతో పాటు, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇన్స్ పెక్టర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.