నితిన్ గడ్కరీ తెలంగాణ పర్యటనలో జై శ్రీరామ్ నినాదాలు..

తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన కొనసాగుతుంది. రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. రూ.7,853కోట్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా… 2 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. దాదాపు 258 కిలో మీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు గడ్కరీ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఏర్పటు చేసిన సభ లో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్‌, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చేతులతో వారించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని… ఇదేం పద్దతి అంటూ.. ఏమాత్రం గౌరవం ఉన్నా ఆపాలంటూ కోరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు.