సిఎం కెసిఆర్ కాన్వాయ్ కారుకు చలానా

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కాన్వాయ్‌లోని ఓ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు. పరిమితికి మించిన వేగంతో నాలుగు సార్లు ప్రయాణించినందుకు గాను చలానా విధించినట్లు అధికారులు చెప్పారు. సిఎం క్వానాయ్‌లో TS 09 K 6666 గల ల్యాండ్ క్రూజన్ ప్రాడో కారుకు ఈ జరిమానా పడింది. ఈ నేపథ్యంలో చలానా మొత్తం రూ. 4,140ను సిఎం కార్యాలయం అధికారులు బుధవారం చెల్లించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/