గద్వాల్‌ గ్లాడియేటర్స్‌పై హైదరాబాద్‌ బుల్స్‌ విజయం

hyderabad-bulls-beat-gadwal-team-kabaddi-league
hyderabad-bulls-beat-gadwal-team-kabaddi-league

హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌ -3లో హైదరాబాద్‌ బుల్స్‌ జట్టు ఘనవిజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బుల్స్‌ 40-28తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. 12 రైడ్‌ పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ బుల్స్‌ ఆటగాడు ప్రసాద్‌ బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గగా… నీలేశ్‌ (గద్వాల్‌ గ్లాడియేటర్స్‌) బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గగా ఎంపికయ్యారు. మరో మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌ జట్టు 43-37తో కరీంనగర్‌ కింగ్స్‌పై గెలుపొందింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/