తొక్కిసలాట.. 14 మంది చిన్నారుల మృతి

school children
school children

నైరోబీ : కెన్యాలోని ఒక పట్టణంలో ఒక స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో 14 మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 39 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన కెన్యా విద్యా మంత్రి జార్జ్‌ మఘోహా ‘తాము 14 మంది చిన్నారులను కోల్పోయామ’ని విచారం వ్యక్తంచేశారు. స్కూల్‌ తరగతులు ముగిసిన తరువాత భవనం మొదటి అంతస్తు నుండి కిందికి దిగివచ్చే ప్రయత్నంలో చిన్నారులు పరుగులు పెట్టటంలో ఈ తొక్కిసలాట ఏర్పడిందని మీడియా వివరించింది. అయితే కిందికి వచ్చేందుకు పరుగులు తీస్తున్న కొంతమంది చిన్నారులు మూడో అంతస్తు నుండి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నారని వెల్లడించింది. తొక్కిసలాట వార్త విన్న చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆస్పత్రి ఎదుట ఎదురు చూస్తున్నారని తెలిపింది. ఈ ఘటనపై ఒక ట్వీట్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని రైలా ఒడింగా చిన్నారుల తల్లిదండ్రులకు తన సంతాపాన్ని తెలియచేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/