హైద‌రాబాద్‌లో భారీ వర్షం : చల్లబడ్డ వాతావరణం

ఉపరితల ఆవర్తనం కారణంగా అకాల వర్షం

Heavy rain in Hyderabad- Cool weather
Heavy rain in Hyderabad- Cool weather

Hyderabad: హైద‌రాబాద్‌లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాతావ‌ర‌ణం చల్లబడింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్, ఫిలింనగర్ లో భారీ వ‌ర్షం పడింది. ఇటీవల హైదరాబాద్‌లో చిరుజ‌ల్లులు ప‌డుతుండ‌డంతో ఎండ వేడిమి కాస్త తగ్గింది. ఇదిలా ఉండగా ఉపరితల ఆవర్తనం కారణంగా అకాల వర్షాలు పడుతున్నాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/