ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
జోగేశ్వరి ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో భారీగా మంటలు

మహారాష్ట్ర: ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గోడౌన్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. గోడౌన్ యాజమాన్యం ఫైర్ ఇంజన్‌లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు గోడౌన్ యాజమాన్యం తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/