ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని పరిశీలించిన నిపుణుల కమిటీ..

,

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యాశాలను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు నిపుణులతో కూడిన బృందం పరిశీలించారు. హాస్పిటల్‌ను పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆపరేషన్లు చేసి గది, పరికరాలను తనిఖీ చేశారు.

ఆపరేషన్లు జరిగిన తీరుపై వైద్యసిబ్బందిని ఆరా తీశారు. సుమారు 30 మంది వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పారదర్శకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని.. రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని డీహెచ్ తెలిపారు. శనివారం వరకు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చే అవకాశముందన్నారు.

రాష్ట్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు 12లక్షలకుపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ నెల 25న జరిగిన ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమని.. బాధిత కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.