అమెరికాను జోబైడెన్‌ గట్టెంకించేనా ?

ప్రతి ఆరు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆకలితో

Joe Biden
Joe Biden


ఎట్టకేలకు అమెరికాకు రాబో తున్న పెను ప్రమాదం జోబైడెన్‌ ప్రమాణస్వీకారం చేయ డంతో తొలగిపోయిందని చెప్ప వచ్చు. ప్రజస్వామ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు పేర్కొనడంతో అమెరికా ప్రజస్వామ్యవాదులు ఊపిరిపీల్చుకు న్నారు. గత నాలుగు సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ సమాజంలో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తానని జోబైడెన్‌ ప్రకటించడంతో అమెరికా ప్రజలలోనే కాక ప్రపంచ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాని 1861 సంవ త్సరంలో దేశంలో అంతర్యుద్ధం చెలరేగిన వేళ అబ్రహం లింకన్‌, 1933లో మహామాంద్యం సంభవించిన వేళ ర్రూజ్వెల్డ్‌ ఎదు ర్కొన్న సవాళ్ల కంటే ఎక్కువ సవాళ్లను కొత్త అధ్యక్షుడు జోబైడెన్‌ ఎదుర్కోనున్నారని చెప్పవచ్చు.ట్రంప్‌ అశాస్త్రీయ వైఖరితో కరోనా కేసుల్లో, మరణాల్లో అమెరికా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.రికార్డు స్థాయిలో చేరిన నిరుద్యోగ రేటు కారణంగా డిసెంబరులోనే లక్షా 40వేల ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అమెరికాలోని ప్రతి ఆరు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. 20 శాతం కుటుంబాలు ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నాయి.మూడోవంతు కుటుంబాలు నిత్యాసవర బిల్లులు చెల్లించలేకపోతున్నాయి.

జార్జిఫాయిడ్‌ హత్యతో ట్రంప్‌ శ్వేతజాతి అహంకారం వల్ల సామాజిక సంక్షోభం ఏర్పడిందని, ట్రంప్‌మద్దతు దారులు క్యాపిటల్‌ భవనంపై జరిపిన దాడితో సమాజం నిట్టనిలు వ్ఞగా చీలిపోయిందని, జాతి అహంకారం తలకెక్కిందని అర్థమ వ్ఞతుంది. సామాజిక, ఆర్థిక సంక్షోభాల నుంచి అమెరికాను గట్టె క్కించడమే బైడెన్‌ ముందున్న లక్ష్యం. ట్రంప్‌ పాలనాకాలంలో అమెరికా అంతర్జాతీయ నాయకత్వాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. పారిస్‌ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం, నాటోకి కాలం చెల్లిందని పేర్కొనడం, ఇరాన్‌తో శాంతి ఒప్పందం నుంచి, రష్యాతో న్యూక్లి యర్‌ ఒప్పందం నుంచి వైదొలగడంతో అంతర్జాతీయంగా అమెరికా ఏకాకి అయిందని చెప్పవచ్చు.కాని బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పారిస్‌ వాతావరణ ఒప్పందంలో చేరుతున్నట్లు ప్రకటించ డం, మెక్సికో అమెరికా మధ్య సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు నిలిపివేయడం,రష్యాతో న్యూక్లియర్‌ ఒప్పందం కొనసాగు తుందని పేర్కొనడం, ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరుతున్నట్లు ప్రకటించడం,ముస్లిం దేశాల వలసలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయ డం, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కొనసాగుతుందని చెప్పడం, గ్రీన్‌ కార్డుల జారీ చేసే విషయంలో ప్రస్తుత దేశాలవారీగా ఉన్న పరిమి తులను ఉపసంహరించుకోవడం, వలస వ్యవస్థను ఆధునీకరిస్తూ యూఎస్‌సిటిజన్‌షిప్‌ యాక్ట్‌-2021ను తీసుకురానుండటం, నాటోతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని పేర్కొనడం, ట్రంప్‌కాలంలో అంతర్జాతీయంగా అమెరికా వైదొలిగిన సంస్థలలో ప్రవేశిస్తామని వెల్లడించడం, జోబైడెన్‌ కెనడా, మెక్సికో ప్రధాన మంత్రులతో మాట్లాడం ఇతర దేశాధినేతలతో మాట్లాడతానని పేర్కొనడం ద్వారా అంతర్జాతీయ నాయకత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడంతో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి వారిని ఆదుకునేందుకు1.9బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజిని అమెరికా ఆపద రక్షణప్రణాళిక పేరుతో ప్రకటించాడు జోబైడెన్‌. ఇందులో భాగంగా ఒక్కొక్క నిరుద్యోగికి రెండువేల డాలర్ల వంతున ఆర్థిక సహాయం అందించనున్నారు. కనీస వేతనం కింద ప్రతి ఒక్కరికి గంటకు 15 డాలర్ల చొప్పున వారానికి 40 గంటల పని కల్పించాలని సూచించారు.

భారత్‌పై బైడెన్‌ వైఖరేమిటి?

బైడెన్‌ ఎంపిక చేసుకున్న పాలనా బృందం అభిప్రాయాలను బట్టి భారత్‌-అమెరికాల మధ్య బంధాన్ని మరింత బలపరుచు కోనున్నట్లు తెలుస్తోంది.రక్షణ వ్యవహారాల్లో భారత్‌తో అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా,జపాన్‌ సమిష్టిగా ఏర్పాటు చేసుకున్న చతుర్భుజ కూటమిని విస్తృతపరిచి మరిన్ని దేశాలను కలుపుకోవాలని, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై పాక్‌ చర్యలు అసంపూర్తిగానే ఉన్నాయని అమెరికా నూతన రక్షణ శాఖమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొనడాన్ని బట్టి భారత్‌,అమెరికాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో బంధం బిల్‌క్లింటన్‌పాలన ముగిసేనాటికి బలపడిందని, ఒబామా కాలంలో మెరుగుపడి,ట్రంప్‌ హయాంలో కొనసాగిందని, భారత్‌ను కలుపుకొని వెళ్తే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాసహా ఏ దేశం కూడా మనకు సవాళ్లు విసరలేదని అమెరికా నూతన విదేశాంగ వ్యవహారాలమంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొనడాన్ని బట్టి భారత్‌ అమెరికామధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందనిచెప్పవచ్చు.

చైనాపై బైడెన్‌ వైఖరేమిటి?

తైవాన్‌ను చైనా ఆక్రమించకుండా నిరోధించేందుకు అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని అమెరికా నూతన రక్షణశాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొనడాన్ని బట్టి అమెరికన్ల ప్రయోజనా లకు, దేశభద్రతకు అతిపెద్ద సవాల్‌ చైనా నుంచే ఎదురవ్ఞతుం దని, జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ హాంకాంగ్లో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన చైనా పట్ల ధోరణి ఏ మాత్రం తగ్గదని నూతన విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొనడాన్ని బట్టి చూస్తే చైనా నుంచి అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉంది. వివిధ రంగాల నుంచి చైనా విసురుతున్న సవాళ్లపై నిఘా వర్గాలను అప్రమత్తం చేస్తాం. అమెరికా అద్భు ప్రగతి సాధించిన రంగాల నుంచి రహస్యాలను తరలించే గూఢ చర్యాన్ని అడ్డుకొని తీరాలని అమెరికా నూతన నిఘా విభాగం అధిపతి అరివిల్‌ హేనేస్‌ పేర్కొనడాన్ని బట్టి చూస్తేఅమెరికా చైనాపై కఠినంగానే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

అమెరికాను నమ్మలేం!

గత చరిత్రను చూస్తే అమెరికా వైఖరి అర్థమవ్ఞతుంది. స్వదేశీ ప్రయోజనాల కోసం ఎంతటి పనికైనా వెనకాడని నైజంఅమెరికాది. అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలోఉన్నా డెమొక్రాట్లు అధికారంలో ఉన్నా అమెరికా ప్రయోజనాల కోసమే విధానాలు రూపొందిస్తుంట రనే విషయాన్ని ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్‌ వంటి ప్రపంచ శక్తిగా మారుతున్న దేశాలు గుర్తుంచుకోవాలి.

  • జుర్రు నారాయణ యాదవ్‌