గోవాలో వందశాతం నల్లా కనెక్షన్లు

ప్రకటించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ

har-ghar-nal-jal-yojna

గోవా: గ్రామీణ ప్రాంతాల్లో 2.30లక్షల గృహాలకు వందశాతం నీటి కనెక్షన్లు కల్పించిన రాష్ట్రంగా గోవా నిలిచినట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు నల్లాల ద్వారా నీటిని అందించాలని జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2.30 లక్షల గ్రామీణ గృహాలను కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఫంక్షనల్ హౌస్‌ ట్యాప్ కనెక్షన్లను (ఎఫ్‌హెచ్‌టిసి) విజయవంతంగా అందిస్తున్నందున దేశంలో మొట్టమొదటి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రంగా నిలిచేందుకు గోవా ప్రత్యేక గుర్తింపు పొందిందని జల్ శక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పంపు నీటి కనెక్షన్‌లను అందించే రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ సిఎం సవాంత్‌కు లేఖ రాశారు. కాగా, నీటి పరీక్షా సదుపాయాలను బలోపేతం చేయడానికి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) చేత గుర్తింపు పొందిన 14 నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలను పొందే ప్రక్రియలో రాష్ట్రం ఉంది. జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామంలో ఐదుగురికి, ముఖ్యంగా మహిళలకు, ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చి, తద్వారా అక్కడ నీటిని పరీక్షించనున్నారు. అలాగే నీటి సరఫరా కార్యాచరణను పర్యవేక్షించడానికి సెన్సార్ ఆధారిత సర్వీస్ డెలివరీ పర్యవేక్షణ వ్యవస్థ నెలకొల్పేందుకు గోవా సర్కారు కసరత్తు చేస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/