ఏపీలో బయటపడ్డ మొదటి ఒమిక్రాన్ కేసు..

omicron variant

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఒమిక్రాన్ వ్యాధి సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి పైన అధికారులు నిఘా పెట్టారు. మొత్తం 15 మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చిన తరువాత వారిలో కోవిడ్ పాజిటివ్ గుర్తించారు. దీంతో.. వారి శాంపిల్స్ జీయోన్ సీక్వెన్సింగ్ కు పంపారు. అక్కడ ఆ 15 మందిలో 34 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు. మిగిలిన వారికి సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అధికారులు అలెర్టయి… బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.

ఏపీలో నమోదైన కేసు తో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారి సంఖ్య 34కు చేరింది. ఏపీకి గత కొంత కాలంగా వస్తున్న విదేశీ ప్రయాణీకుల పైన ప్రభుత్వం నిఘా కొనసాగిస్తోంది. అయితే, జీనోమ్ సీక్వెన్సీకి పంపిన నమూనాల్లో మరో పది మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఏపీలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవటంతో…ఇతర రాష్ట్రాల విమానాశ్రయాల్లో దిగి రాష్ట్రానికి చేరుకున్న వారికి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.