అలనాటి స్టార్ హీరో ఫరాజ్ ఖాన్ కన్నుమూత

పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం

Faraz khan -File
Faraz khan -File

బాలీవుడ్ లో 1990లలో హీరో గా ఒక వెలుగు వెలిగిన ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఈరోజు ఆఖరి శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

కొద్ది నెలల కిందట  ఫరాజ్ ఖాన్ ఛాతి మెదడు సంబంధిత ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండటంతో కుటుంబీకులు చికిత్సకోసం బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో చేర్పించారు.

ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి రావడంతో భారీ మొత్తంలో ఖర్చయింది. దీంతో ఫరాజ్ ఖాన్ కుటుంబీకులు  వైద్య ఖర్చుల కోసం దాతల సాయం కోరారు. 

ఫరాజ్ ఖాన్ ఆరోగ్యపరిస్థితి ఇబ్బందులపై పై నటి పూజాభట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించి సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించి ఆర్థిక సాయం ఫరాజ్ ఖాన్ చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందజేశారు.

అప్పటి నుంచి ఆయనకు చికిత్స చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఫరాజ్ ఖాన్ మృతిచెందారని ఆయన వైద్య చికిత్సలకు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెబుతూ నటి పూజాభట్ ట్వీట్ చేశారు.

ఫరాజ్ ఖాన్ 1990లలో వరుస విజయాలతో స్టార్డమ్ అందుకున్నాడు. ఫరేబ్ మెహందీ మైనే ప్యార్ కియా వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

ఆ తర్వాత వరుసగా ఆయన సినిమాలు ఫ్లాప్ కావడంతో సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు.

ఫరాజ్ ఖాన్ మృతి విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/