చంద్రబాబుపై రోజా విమర్శలు

చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలి..రోజా

mla roja
mla roja

అమరావతి: సిఎం జగన్‌పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసలు కురిపించారు. ఈరోజు జరిగిన బీసీ కార్పొరేషన్ సభలో రోజా మాట్లాడుతూ.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. వేల కోట్ల రూపాయల సహాయం అందించారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలని రోజా ఉచిత సలహా ఇచ్చారు. బీసీలకు చంద్రబాబు ఏం చేసారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/