కరోనా భయంతో.. ఎగ్జిబిషన్‌ కార్యక్రమాలు రద్దు

Geneva Motor Show Cancelled Over Coronavirus Scare
Geneva Motor Show Cancelled Over Coronavirus Scare

జేనీవా: కోవిడ్‌-19 వైరస్‌(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్‌ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలోనే ఆటో షో రద్దు అయ్యిందని స్విట్జర్లాండ్‌ మంత్రి అలైన్‌ బెర్సెట్‌ ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/