పవన్‌ కళ్యాణపై కేసు ఓ వదంతు

అందులో వాస్తవం లేదన్న గుంటూరు రూరల్‌ ఎస్‌పి

Pawan kalyan
Pawan kalyan

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేస్తారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్‌ ఎస్‌పి ఖండించారు. అవన్నీ ఒట్టి వదంతులు వాటిని ఎవ్వరూ నమ్మొద్దు అని చెప్పారు. కాగా నిన్న రాజధాని ప్రాంతంలో జనసేనాని పర్యటించి విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో పవన్‌ కళ్యాణ్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆయన పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నారని వదంతులు కాస్త గట్టిగానే వ్యాపించాయి. అయితే ఈ విషయంపై స్పందిచిన గుంటూరు రూరల్‌ ఎస్‌పి విజయారావు మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయడం లేదు. అలా వస్తున్న వార్తలన్ని అవాస్తవం. సోషల్‌ మీడియా వేదికగా వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. అంతేకాకుండా ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/