ఇంట్లో అందమైన భార్య ను పెట్టుకొని..హాస్పటల్ కు వచ్చే మహిళలతో కోర్కెలు తీర్చుకుంటున్న డాక్టర్

ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. కట్టుకున్న భార్య , భర్త ఉండగానే పడక సుఖం కోసం వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. సామాన్య ప్రజలే కాదు సమాజంలో ఉన్నంత స్థాయిలో ఉన్న వారు సైతం ఇలాంటి పనులు చేస్తూ ఛీ కొట్టించుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద డాక్టర్..ఇంట్లో భార్య ఉండగానే ఆమెను పట్టించుకోకుండా..హాస్పటల్ కు వచ్చే యువతులు , ఆంటీల ఫై కన్నేసి వారితో చనువుగా ఉంటూ వారితో తన కామ కోర్కెలు తీర్చుకున్నాడు. ఈ విషయం భార్య కు తెలియడం తో డైరెక్ట్ గా భర్తను పట్టుకొని నిలదీసింది. అంతే అతడు కోపంతో ఆమెను ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు.

వివరాల్లోకి వెళ్తే

జార్ఖండ్ లోని రాంచీలో ధీరేంద్ర కుమార్ అనే డాక్టర్ ..సొంతంగా ఆసుపత్రి పెట్టుకొని బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. డాక్టర్ ధీరేంద్ర కుమార్ కు సుమన అనే యువతి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ధీరేంద్ర ఆమెతో ఎంతో బాగా ఉంటూ..బయటకు తీసుకెళ్తు హ్యాపీ గా చూసుకున్నాడు. రెండేళ్లుగా అతడిలో మార్పు వచ్చింది. కరోనా కారణంగా హాస్పటల్ లోనే ఎక్కువగా గడుపుతూ వచ్చాడు. ఈ క్రమంలో హాస్పటల్ కు చికిత్స కోసం వచ్చే మహిళలతో చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. వారిలో కొంతమందిని ఎంపిక చేసుకొని వారిని దగ్గర చేసుకొని తన కామ కోర్కెల ను తీర్చుకోవడం స్టార్ట్ చేసాడు. ఈ క్రమంలో భార్య ను
అదనంగా వరకట్నం తీసుకరావాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. దీంతో ఆమె..అతడి పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆమెపై మరింత కోపం పెంచుకొని ఇంటికి పంపించాడు. భార్య ఇంట్లో లేకపోవడం తో ఏకంగా అమ్మాయిలను ఇంటికే పిలిపించుకొని వారితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాడు. ఈ విషయం భార్య కు తెలియడం తో ..డైరెక్ట్ గా సుమన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో డాక్టర్ ధీరేంద్ర కుమార్ అతని ప్రియురాలితో బెడ్ మీద ఉండడం చూసి రగిలిపోయింది. ధీరేంద్ర తో గొడవకు దిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన డాక్టర్ ధీరేంద్ర కుమార్ ఇనుప రాడ్ తీసుకుని భార్య సుమన తల మీద గట్టిగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు వదిలింది. విషయం తెలిసి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసారు.