షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం

YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయడం ఫై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్‌ చేశారు.

వరంగల్ జిల్లాలో తన వాహనంపై దాడిని నిరసిస్తూ, అదే వాహనంతో షర్మిల లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు వెళ్లే ప్రయత్నం చేయడం తెలిసిందే. దాంతో ఆమెను పోలీసులు ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. అటు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న కారణంతో పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. ఆమెను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో, షర్మిలకు ఊరట కలిగిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

షర్మిల జైలు నుంచి లోటస్ పాండ్ చేరుకున్నారు. దీంతో విజయమ్మ నిరాహారదీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, మీరు రుణమాఫీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదని నిలదీశారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు లేకపోతే నేను ఉద్యోగ భృతి అన్నారని.. మీరు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఫైర్‌ అయ్యారు.