బాలయ్య తో ఖిలాడీ బ్యూటీ చిందులు

2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి.. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో ‘జర్రా జర్రా’ ఐటమ్ సాంగ్ తో యూత్ కు దగ్గరైంది. హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. రీసెంట్ గా ఈమె మాస్ రాజా రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది.సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది.

ఇక ఇప్పుడు బాలకృష్ణ పక్కన మాస్ స్టెప్స్ వేసే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అఖండ తో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం తన 107 వ సినిమా చేస్తున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తుంది.

ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్ ను ప్లాన్ చేసాడట డైరెక్టర్ గోపి. ఆ మాస్ సాంగ్ లో బాలయ్య పక్కన చిందులేసి ఛాన్స్ డింపుల్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ ను చేయనున్నారట. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా..దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారట.