పూజా.. మన కాజా..అంటూ దిల్ రాజు హాట్ కామెంట్స్

పూజా హగ్దే..ప్రస్తుతం ఇండస్ట్రీ లో గోల్డెన్ బ్యూటీ. 2014 లో ఒక లైలా కోసం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. తెలుగు , హిందీ లలో సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా విజయాలు సాదించకపోయేసరికి , అమ్మడిని ఐరెన్ లెగ్ తేల్చారు. ఈ తరుణంలో డైరెక్టర్ హరీష్ శంకర్ అవేమి పట్టించుకోకుండా డీజే మూవీ లో అల్లు అర్జున్ సరసన ఎంపిక చేసాడు. ఈ మూవీ లో పూజా గ్లామర్ , డాన్స్ , బికినీ షోస్ యూత్ ను కట్టిపడేశాయి. సినిమా యావరేజ్ హిట్ అందుకున్నప్పటికీ , పూజా కు మాత్రం బాగా కలిసొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వెనుకకు చూసుకొనవసరం లేకుండా అయిపొయింది. అమ్మడు ఏ సినిమా చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. దీంతో అంత అమ్మడిని గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె తమిళ్ హీరో విజయ్ సరసన బీస్ట్ మూవీ లో నటించింది. ఈ మూవీ ఈ నెల 13 న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో నిన్న శుక్రవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుక లో దిల్ రాజు మాట్లాడుతూ..పూజా.. మన కాజా అంటూ అమ్మడిపై హాట్ కామెంట్స్ చేసాడు. ఆమె లెగ్గు పడితే సూపర్‌ హిట్టే అంటూ బుట్ట బొమ్మని ఆకాశానికి ఎత్తేశాడు. దిల్ రాజు మాట్లాడుతుంటే అభిమానులు తెగ సంబరపడ్డారు.

YouTube video