దేవి శ్రీ ఇంట వరుస విషాదాలు

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సోదరుడి మ‌రణ వార్త విని దేవీ శ్రీ ప్ర‌సాద్ మేన‌త్త సీతా మ‌హాల‌క్షి గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో వ‌రుస మ‌ర‌ణ వార్త‌లు విని దేవి శ్రీ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతగారి పేరు నారాయణ కమ్యూనిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. మొత్తం ఆరుగురు సంతానం.

ఇక దేవి శ్రీ సినిమాల విషయానికి వస్తే..అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు ‘పుష్ప’కు బాణీలు కడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుగుతోంది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపనుంది పుష్ప టీమ్.
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.