శ్రీశైలంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజున నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో గణపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్షా సంకల్పం, కంకణ పూజ, బుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, అఖండదీప స్థాపన, వాస్తుపూజ, మండపారాధన, చండీ కలశస్థాపన, వాస్తుపూజ, మండపారాధనచ, కలశస్థాపన పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీభ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ అలంకారంలో అమ్మవారు ద్విభూజాలు కలిగి కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు, విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

కాగా సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భృంగి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ఆవరణలోనే పూజలు చేయనున్నారు. కొవిడ్‌ నేథప్యంలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/