బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ టాక్ : గణేష్ అన్న కుమ్మేసాడు

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘డేగల బాబ్జీ’ . వెంకట్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యష్ రిషి ఫిలిమ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఒత్తు సేరుప్పు సైజ్ 7 సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

ఒక హత్యకేసులో ప్రధాన నిందితుడైన డేగల బాబ్జీ .. అసలు ఆ హత్యను తానెందుకు చేయాల్సి వచ్చిందో వివరించడం.. ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ ట్రైలర్ లో బండ్ల గణేశ్ డైలాగ్స్, ఎమోషన్స్, హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ‘పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తునే ఉన్నాం’.. ‘అసలు అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా’ అంటూ ఆయన పలికే డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి.

YouTube video