కరోనా తో హాస్పటల్ లో చేరిన కొడాలి నాని , వంగవీటి రాధా

వైసీపీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా లు కరోనా బారినపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి ఎక్కువైనా సంగతి తెలిసిందే. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతుండడంతో పెద్ద సంఖ్య లో సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ నేతలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కరోనా బారినపడి హైదరాబాద్ లోని ప్రవైట్ హాస్పటల్ లలో చికిత్స తీసుకుంటున్నారు. ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరిన నాని..ఆరోగ్యం నిలకడగానే ఉందని ఖంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెపుతున్నారు.

మంత్రి కొడాలి నాని తో పాటు టీడీపీ నేత వంగ‌వీటి రాధా కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. వంగ‌వీటి రాధా కూడా హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే వంగవీటి రాధా కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం బాగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వంగవీటి రాధా… తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో వంగవీటి రాధా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.