ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు..ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పం వస్తున్నందున టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఈరోజు గురువారం అమరావతి లో పర్యటించారు. రాజధాని కోసం పోరాడిన ఘనత అమరావతి రైతులదని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని , అమరావతిని ప్రపంచమంతా గుర్తించిందని, A అంటే అమరావతి, P అంటే పోలవరం అంటూ ఉద్ధాటించారు. రాజధాని అమరావతిని వైసిపి ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని, కానీ గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని ఆయన అన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి ఆశీస్సులు, స్థల మహత్యం వల్లనే అమరావతిని కాపాడుకున్నామని చంద్రబాబు తెలిపారు.