మునుగోడులో కాంగ్రెస్ పార్టీదే విజయం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుండడం తో అన్ని పార్టీ లు ఉప ఎన్నికపై కసరత్తులు మొదలుపెడుతున్నాయి. బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగుతుండడం తో విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఆ సీటులో కాంగ్రెస్ గెలిచిందని..మళ్లీ కాంగ్రెస్సే దక్కించుకుంటుందని అన్నారు. మునుగోడులో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ నుంచి రాజ్ గోపాల్ రెడ్డి ఎందుకు బయటికెళ్లారో..ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు.

మరోపక్క మునుగోడు ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను లంచ్ టైంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని బండి సంజయ్ అడిగానని తెలిపారు. ఈనెల 21వ తేదీన చౌటుప్పల్ లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, దీనికి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.