కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మాటలు తూటాలు

బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదు.. కుమారస్వామి

kumaraswami
kumaraswami

బెంగళూరు: కర్ణాటకలో మొన్నటి దాకా అధికారాన్ని పంచుకున్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ నేపథ్యంలో, ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ అధినేత కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకకు, బెంగళూరుకు కాంగ్రెస్ పార్టీ సురక్షితం కాదని అన్నారు.

ఇటీవల బెంగళూరులో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటికి నిప్పు పెట్టిన తర్వాత అల్లర్లు జరిగాయి. ఈ అంశాన్ని బిజెపి తనకు అనుకూలంగా వాడుకుంది. దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ..ఇప్పుడు అసలు విషయం అందరికీ అర్థమవుతోందని… బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదనే విషయం ఓటర్లకు అర్థమైందని అన్నారు. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/