తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు : చిరంజీవి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా అభిమానులు , కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. మెగా హీరోలంతా ఒక్కొక్కరుగా వారి ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

అన్నయ్య చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో..చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్
@PawanKalyan అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ , చరణ్ మొదలగు మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కు విషెష్ అందించారు. అలాగే సినీ స్టార్స్ సైతం ఉదయం నుండి పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తూ వస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరులోనే వైబ్రేష‌న్ ఉంటుంది. పవన్ కనపడమే కాదు ఆ పేరు వినిపించిన సరే అభిమానుల‌లో తెలియ‌ని జోష్ వ‌స్తుంది. ఆర‌డుగు బుల్లెట్ అత‌ను. సైనికుడి క‌త్తికున్న ప‌దును అత‌డు .సాయంకోరిన వారికి అండ‌గా నిలిచే ఆప‌ద్భాంద‌వుడు. ఆయన క్రేజ్ ఎవరెస్ట్.. ఆయన స్టైల్ ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ఆయ‌న స్టైల్‌ని అనుక‌రించేలా చేసిన ప‌ర్‌ఫెక్ట్ ప‌ర్స‌న్. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు.

మూడేళ్లు సినిమాల‌కు దూరంగా ఉండే సరికి ఆయ‌న అభిమానులు నీర‌సించిపోయారు. ఎప్పుడైతే వ‌కీల్ సాబ్ ప్ర‌క‌టించాడో ఆ స‌మ‌యంలో ఆయ‌న అభిమానులు వంద ఓల్టుల ఎనర్జీతో ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించారు. ఇక సినిమా రిలీజ్ రోజు వారి అభిమానం చూడాలి రెండు కళ్లు చాలలేదు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు చేస్తుండడం తో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు అంత కూడా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల తాలూకా అప్డేట్స్ , బర్త్ డే విషెష్ తో నిండిపోతుంది.