పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారు: సీఎం కెసిఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య శనివారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు ఉద‌యం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడం తో రోశ‌య్య‌ను కుటుంబ సభ్యులు హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.

.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/