ఏపీలో వాతావరణంలో మార్పులు : వర్షాలు కురిసే అవకాశం

వాతావరణ శాఖ వెల్లడి

Climate change in AP- Chance of rain
Climate change in AP- Chance of rain

Amaravati: ఏపీలో రానున్న మూడు రోజులు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి దిశ నుండి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, దీని కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు .కాగా , దక్షిణకోస్తాంధ్రలో ఇవాళ, రేపు ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తెర-(సినిమా)వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/