చిట్యాల ఐలమ్మ ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకం : సీఎం కెసిఆర్

kcr cabinet meeting updates
CM-KCR

హైదరాబాద్ : హైదరాబాద్‌: నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం కెసిఆర్ అన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని సీఎం కెసిఆర్ స్మరించుకున్నారు. నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని సీఎం కొనియాడారు.

నాటి వారి స్ఫూర్తి తెలంగాణ సాధనలోనూ, అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం కెసిఆర్ తెలిపారు. చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు.