తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారుః చంద్రబాబు

chandrababu-response-on-pv-ramesh-ex-ias-comments-on-land-titling-act

అమరావతిః ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లిదండ్రుల భూములపై కూడా తనకు హక్కు లేకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని తెలిపారు. 36 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే… సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని తానని అన్నారు.

పీవీ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ సీఎం కార్యాలయంలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే… ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఊహించండని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి, మీ స్థలం, మీ పొలం మీది కాదని అన్నారు.