గ్రీన్‌కు స్వల్ప గాయం

ఆస్ట్రేలియాకు మరోదెబ్బ

Cameroon Green Slight injury
Cameroon Green Slight injury

సిడ్నీ : ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ గ్రీన్‌ ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో స్వల్పంగా గాయపడ్డాడు. దీనితో తొలి టెస్టుకు సిద్ధమైన ఆస్ట్రేలియాకు మరోదెబ్బ తగిలింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడిన రెండో ఆటగాడు గ్రీన్‌.

ఇంతకుముందు జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టెస్టు ఓపెనర్‌గా భావిస్తున్న విల్‌ పకోస్కి హెల్మెట్‌కు బుమ్రా బౌన్సర్‌ తగలడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుతిరిగాడు.

శుక్రవారం డే-నైట్‌ మ్యాచ్‌గా ఆరంభమైన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడి డ్రైవ్‌ను అడ్డుకోబోయిన బంతి గ్రీన్‌ వేళ్లకు తగిలి ఆపై అతడి తలకు కుడివైపు బలంగా తాకింది. దీనితో గ్రీన్‌ పిచ్‌పైనే కూలబడ్డాడు.

వెంటనే వైద్య సిబ్బంది అతడిని పరీక్షించి గ్రౌండ్‌ బయటకు తీసుకెళ్లారు. అతడిని ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లనుంచి తప్పించినట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. బుమ్రా టాప్‌స్కోరర్‌గా 55 పరుగుల చేయడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/