నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో అమ్మాయిలతో చిందులేసిన తహసీల్దార్‌

న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. 2022 కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అంత సిద్ధమయ్యారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు..మందు , విందు ఒకటేంటే..ఏమికావాలో అన్ని సిద్ధంచేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్‌ అమ్మాయిలతో డ్యాన్స్‌లతో హంగామా చేశారు.

కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్‌ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్‌లు వేవారు తహసీల్దార్‌ హమీద్.

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో నెటిజన్లు అధికారులపై ఫైర్ అవుతున్నారు. కరోనా నిబంధనలు కేవలం సామాన్యులే పాటించాలా..అధికారులు పాటించారా..? న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడం ఏంటి? ఇలా రెచ్చిపోయి డ్యాన్స్‌లు ఏంటి ? అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.