రామగుండంలో దారుణం : పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు

Crime in karimnagar
Crime in karimnagar

దేశంలో ఎక్కడ చూసిన మహిళల ఫై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కామ కోరిక తీర్చాలని కొంతమంది , ప్రేమించలేదని మరికొంతమంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్య లో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతీ పెళ్లికి నిరాకరించిందని కోపం తో ఆమె గొంతుకోసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ కార్పొరేషన్ యైటింక్లైయిన్ కాలనీ కెకె నగర్ కు చెందిన అంజలి అనే యువతీ డిగ్రీ చదువుతుండగా.. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు.. వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. అయితే కొద్దీ రోజులుగా పెళ్లి చేసుకోవాలని రాజు ..అంజలి వెంట పడుతుండంతో ఆమె రాజును దూరం పెట్టింది. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడం తో రాజు కోపం తో గొంతు కోసి హత్య చేసాడు.

రాజు అంటే..అంజలి ఇంట్లో అస్సలు ఇష్టం లేదంటూ.. స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు.. రక్తం మడుగులో ఉన్న అంజలిని.. పోస్ట్ మార్టం కు పంపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం ప్రియుడు రాజు పరారీలో ఉన్నాడు.