ఇయాన్ చాపెల్‌కు చేదు అనుభవం
కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచనలు

అడిలైడ్ : ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇయాన్ చాపెల్‌కు రెండో రోజు ఆట జరుగుతున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది.
స్టేడియంను వీడి వెళ్లాలని చాపల్‌ను నిర్వహణాధికారులు కోరడంతో విస్మయానికి గురవడం చాపల్ వంతైంది. సిడ్నీలోని నార్త్ర్న్ బీచెస్ ప్రదేశంలో చాపల్ నివసిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో కొవిడ్ తిరిగి విజృంభించడంతో అధికారులు చాపల్పై అనుమానంతో స్టేడియం వీడి వెళ్లాలని కోరారు.
77 ఏళ్ల చాపెల్ తాను ఇటీవల ఆ ప్రాంతానికి వెళ్లలేదని, తాను అక్కడివారిని కలవలేదని తెలిపినా అధికారులు చాపల్‌ను కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
అధికారులు అలా ఎందుకు ప్రవర్తించారో తనకు అర్ధం కాలేదని, ఈ అనుభవం వింతగా ఉందని చాపల్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా ఆ ప్రాంత నివాసే.
అతడు శుకవ్రారమే స్వస్థలానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలలో ఒకడైన ఇయాన్ చాపల్ పేరును సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్టేడింయంలో ఒక స్టాండ్‌కు పెట్టడం గమనార్హం.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/