‘సోలో బ్రతుకే సో బెటర్‌ ట్రైలర్‌. సాయితేజ్‌ వాయిస్‌ ప్రత్యేక ఆకర్షణ

'సోలో బ్రతుకే సో బెటర్‌ ట్రైలర్‌. సాయితేజ్‌ వాయిస్‌ ప్రత్యేక ఆకర్షణ

సాయితేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుబ్బ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌.. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.. జీ స్టూడియో అసోసియేషన్‌తో డిసెంబర్‌ 25న ఈచిత్రం విడుదల కానుంది. శనివారం ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.. ప్రజలు ఆగ్రహంతో సాయితేజ్‌ కటౌట్‌కు మంట పెడతారు. దాని గురించి చెబుతూ సాయితేజ్‌ వాయిస్‌తోనే ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది..

మన ర్జాఆ్యంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని హక్కులను ఇచ్చింది.. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్‌ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నాం.. అని సాయితేజ్‌ డైలాగ్‌తో తన క్యారెక్టర్‌ ఎలా ఉంటందనే దానిపై క్లారిటీ ఇచ్చారు.. మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, పెళ్లి చేసుకోవాలి.. అంటూ ఆర్‌నారాయణమూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో ట్రైలర్‌ను ఎండ్‌చేశారు..