బెంగళూరు రేవ్ పార్టీ కేసు..నటి హేమకు నోటీసులు

Bengaluru rave party case..Notices to actress Hema
Bengaluru rave party case..Notices to actress Hema

హైదరాబాద్‌ః రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.