పవన్ చేసిన తప్పు ఇదేనా అంటూ జగన్ సర్కార్ ఫై బండ్ల గణేష్ కామెంట్స్

పవన్ చేసిన తప్పు ఇదేనా అంటూ జగన్ సర్కార్ ఫై బండ్ల గణేష్ కామెంట్స్

జగన్ సర్కార్ చిత్రసీమ కు పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ కు అనుమతి లేదని తెలిపి షాక్ ఇచ్చింది. డిసెంబర్ నుండి వరుస పెద్ద సినిమాలు వస్తున్న తరుణంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా జ‌గ‌న్ స‌ర్కార్ కు ట్విట్ట‌ర్ వేదిక గా కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌జ‌ల కోసం ప్ర‌గ‌తి కోసం జాతి కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన త‌ప్పా.. అని జ‌గ‌న్ స‌ర్కార్ ను నిర్మాత బండ్ల గ‌ణేష్ ప్ర‌శ్నించాడు.

ఇక ఏపీలో బెనిఫిట్‌ షోలు ఉండబోవని సమాచార శాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో లకు ప్రత్యేక అనుమతి ఉంటుందని..అది కూడా చారిటీస్ కోసం మాత్రమే అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శన లు మాత్రమే చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు థియేటర్ల ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి టికెట్ల విక్రయాలు జరిగేవని… బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సినిమా టికెట్ల విక్రయిస్తామని తెలిపారు.