కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు

Bandla Ganesh application for Congress party MP ticket

హైదరాబాద్‌ః టాలీవుడ్‌ నిర్మాత, కాంగ్రెస్‌ పార్టీ నేత బండ్ల గణేష్ పార్లమెంట్‌ బరిలో ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే…మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ రోజు ఉదయం మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నాను…మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌.

కాగా, అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం మల్లు రవి కొడుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు మల్లు రవి కొడుకు మల్లు సిద్ధార్థ్. యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరిన మల్లు సిద్ధార్థ్….తనకు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు.