బాల గేయం : పెంచాలి వనాలు

Trees

బట్ట కట్టనినాడే మానవుడు
బతికించేది చెట్టన్నాడు
అమ్మోరని కొలిచాడు
ఆరగింపులెట్టేడు
అన్నీనాకే తెలుసన్నవాడికి
నవనాగరీకుడనని
విర్రవీగుతున్న వాడికి
చెట్టు విలువ పట్టదు
బతుక నేర్చిన బడాచోర్‌
బుగ్గి చేస్తున్నాడు చెట్టును
చేజేతులారా భగ్నం చేస్తున్నాడు
బతుకులను భావితరాలకు
బతుకే లేకుండా చేస్తున్నాడు
అందుకే మనం మేల్కోలపాలి
వారికి చెట్టే ఊపిరి అని చెప్పాలి
నాటించాలి మొక్కలు
నడుం కట్టించాలి వనాల పెంపుకు
భవితకు బలం బంధువ్ఞ ధనంకాదు
వనం అని తెలియజెప్పాలి

  • సత్యవాణి కుంటముక్కల, కాకినాడ

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/