మాచర్లలో ఆశావర్కర్ ను లైంగిక దాడి చేసి చంపేశారు

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల చేతిలో ఓ మహిళా హత్యకు గురైంది. ఏపీ వ్యాప్తంగా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన , కఠిన చర్యలు చేపట్టిన కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరి మహిళనే కాదు అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా తన సెల్‌ఫోన్‌ పోవడంతో వెతకడానికి వెళ్లిన ఓ ఆశా వర్కరుపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం పెద అనుపు చెంచుకాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

కాలనీకి చెందిన ఆశావర్కరు (46) ఈ నెల 17 నుంచి కనిపించకపోవడంతో భర్త, ఆమె తండ్రి వెతుకులాట ప్రారంభించారు. 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వివాహిత తన ఇంటి సమీపానికి వచ్చి సెల్‌ఫోన్‌ పోయిందని తనకు చెప్పినట్లు అదేగ్రామానికి చెందిన మండ్లి ముత్తయ్య వారికి తెలిపారు. బీకేవీ పాలేనికి చెందిన చావిటి చిన అంజి, శీలం అంజి, బైస్వామి కూలి డబ్బులు కోసం అదే సమయంలో తన ఇంటికి వచ్చారన్నారు. సెల్‌ఫోన్‌ ఎక్కడుందో బీకేవీపాలేనికి చెందిన వెంకన్న అనే వ్యక్తి కనిపెడతాడని చెప్పడంతో ఆమె వారితో కలిసి వెళ్లిందని ముత్తయ్య చెప్పారు. దీంతో వివాహిత భర్త, లస్కర్‌, గ్రామస్థులు శనివారం రాత్రి బీకేవీపాలేనికి వెళ్లి వెంకన్నను విచారించారు. ఆమె తన వద్దకు వచ్చిన మాట వాస్తవమేనని, సెల్‌ఫోన్‌ స్విచ్ఛా్‌ఫలో ఉండడంతో, తర్వాత రోజు వస్తే చూస్తానని చెప్పడంతో ఆమె ఆ ముగ్గురితో కలిసి తిరిగి వెళ్లిందని సమాధానమిచ్చాడు. చావిటి చినఅంజి, శీలం అంజిలను గ్రామస్థులు పట్టుకుని నిలదీయగా.. ముగ్గురం కలిసి అత్యాచారం చేశామని, రాయితో తలపై కొట్టడంతో మృతి చెందిందని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.