బిగ్ బాస్ 5 : ప్రియాంక కు మద్దతు ఇస్తున్న మెగా బ్రదర్

బిగ్ బాస్ 5 : ప్రియాంక కు మద్దతు ఇస్తున్న మెగా బ్రదర్

తెలుగు లో బిగ్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. అన్ని సీజన్ల మాదిరిగానే హౌస్ లో అల్లర్లు , గొడవలు , ఏడుపులు , ప్రేమలు మొదలయ్యాయి. ఈసారి హౌస్ లోకి ఏకంగా 19 మంది వెళ్లడం తో మూడో రోజు నుండి సభ్యుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం , సారీ లు చెప్పుకోవడం , వల్గర్ గా మాట్లాడుకోవడం చేసారు. హౌస్ లో సభ్యుల రచ్చ ఇలా ఉంటె..సోషల్ మీడియా లో మాత్రం తమకు నచ్చిన సభ్యుడిని సపోర్ట్ చేస్తూ..ఇతర సభ్యుల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ ఫై సినీ ప్రముఖులు స్పందించలేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తన సపోర్ట్ ఎవరికో తెలిపి ఆశ్చర్య పరిచాడు.

బిగ్ బాస్ 5 : ప్రియాంక కు మద్దతు ఇస్తున్న మెగా బ్రదర్

సీజన్ 5 లో ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ రవి, యానీ మాస్టర్‌, సింగర్‌ శ్రీరామ్‌తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక విన్నర్‌ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు.