శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

పంచెకట్టు, తిరునామంతో శ్రీవారిని దర్శించుకున్న జగన్‌

AP CM YS Jagan

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతకుముందు శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామిని సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాల మధ్య ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు.

ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించిన వైఎస్ జగన్ గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకు పట్టువస్త్రాలు సమర్పించారు.

పంచెకట్టు, తిరునామంతో శ్రీవారిని దర్శించుకున్న జగన్‌

AP CM YS JAGAN-

అనంతరం గరుడ వాహన సేవలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

గురువారం మరోసారి శ్రీవారిని దర్శించుకుని అమరావతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పయనం కానున్నారు .

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/