ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

tenth-class-exams

అమరావతిః ఏపిలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, 8న ఇంగ్లిష్‌, ఏప్రిల్‌ 10న గణితం, 13న సామాన్య శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 17న కాంపోజిట్స్‌ కోర్సు పరీక్ష, 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష ఉంటుందని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/movies/