పవన్ కళ్యాణ్ కు కొడాలి నాని సలహా ..

AP Minister Kodali Nani
AP Minister Kodali Nani

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యవహారం కొనసాగుతున్న వేళ…నాని సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో రాజకీయ సమాధి చేస్తామన్నారు ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలన్నారు.

పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని.. ఆ తర్వాతే మాట్లాడాలని కొడాలి నాని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఒకరికి అధికారం, మరొకరికి డబ్బు వస్తుందే కానీ, ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పవన్ సహా మరో నాలుగు పార్టీలు కలిసినా ప్రజలు పట్టించుకోరని , వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ఒంటరిగానే పోటీ చేసి 151 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చూడాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబు చెప్పినట్లుగానే వాగుతుంటారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు, కళ్లకు గంతలు కట్టాము.. అనుకుంటే అది మీ భమ్రే అంటూ విమర్శించారు. మీరు కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఎన్ని గుంపులుగా వచ్చినా చెల్లెచెదురు చెయ్యడానికి సింహం సింగిల్‌గానే వచ్చేందుకు రెడీగా ఉందని కొడాలి నాని అన్నారు.