అల్లు అర్జున్‌కు బ్లాక్‌ బస్టర్‌ కంగ్రాచ్యులేషన్స్‌

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

విశాఖ: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాస రావు స్పందించారు. ఈ చిత్ర హీరో అల్లు అర్జున్‌కు బ్లాక్‌ బస్టర్‌ కంగ్రాచ్యులేషన్స్‌ అంటూ గంటా శ్రీనివాస రావు ట్వీట్‌ చేశారు. అల వైకుంఠ చిత్రంబృందానికి శుభాభినందనలు తెలిపారు. ఈ చిత్రం అద్వితీయమైన విజయం నమోదు చేసిందని పేర్కొన్నారు. కాగా హీరో అల్లు అర్జున్‌ కూడా తన చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాతి సంబరాలు మొదలయ్యాయంటూ ట్విట్టర్‌లో ద్వారా అభిమానులకి థాంక్యూ, థాంక్యూ అంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు.

తాజా తెలంగాణ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/