ఏపిలో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు

329 కి చేరిన మొత్తం కరోనా కేసులు

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు బులెటిన్‌లో వెల్లడించారు. కాగా కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 329 కి చేరింది. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/