‘భారత్‌ మాతా కీ జై’: అమితాబ్ బచ్చన్ ట్వీట్

రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ వివాదం

Amitabh Bachchan tweet saying Bharat Mataki Jai!

ముంబయిః జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి ఈ మేరకు తీర్మానం చేయవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.